శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Cinema - Mar 24, 2020 , 13:42:32

జైల్లో ఉన్న హాలీవుడ్‌ నిర్మాత హార్వేకు కరోనా

జైల్లో ఉన్న హాలీవుడ్‌ నిర్మాత హార్వేకు కరోనా

లాస్‌ఏంజల్స్‌: హాలీవుడ్‌ నిర్మాత హర్వే వెయిన్‌స్టీన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనతోపాటు  మరో ఖైదీకి వైరస్‌ సోకినట్లు జైలు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. పలు చిత్రాలను నిర్మించిన వెయిన్‌స్టీన్‌పై గతంలో పలువురు నటీమణులు లైంగికదాడేల ఆరోపణలు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. 2013లో న్యూయార్క్‌ సిటీ హోటల్‌లో ఓ నటిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో దోషిగా తేలిన ఆయనకు కోర్టు ఇటీవల 23 ఏండ్లు జైలు శిక్ష విధించింది. దీంతో హార్వేను వెన్‌డి కారాగారానికి తరలించగా అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఆయనకు కరోనా సోకినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. logo