శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Feb 23, 2021 , 09:50:27

హాలీవుడ్ ద‌ర్శ‌కుడితో ప్ర‌యోగం చేయ‌బోతున్న జూనియ‌ర్ ఎన్టీఆర్

హాలీవుడ్ ద‌ర్శ‌కుడితో ప్ర‌యోగం చేయ‌బోతున్న జూనియ‌ర్ ఎన్టీఆర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మంచి జోరు మీదున్నాడు.  ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) సినిమా కోసం ఏడాదిన్న‌ర‌కు పైగా కాల్షీట్స్ కేటాయించిన ఎన్టీఆర్ మ‌రి కొద్ది రోజుల‌లో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయ‌నున్నాడు. అక్టోబ‌ర్ 13న ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. 3019,2020ల‌లో ఎన్టీఆర్ సినిమా రాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ ఆయ‌న తాజా చిత్రం కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రెండేళ్ళ గ్యాప్‌ని ఫుల్ ఫిల్ చేసేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. 

ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తైన త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఈ చిత్రానికి అయిన‌ను పోయి రావ‌లె హ‌స్తినకు అనే టైటిల్ పరిశీలిస్తున్నార‌ట‌. ఇందులో విజ‌య్ సేతుపతి విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని టాక్.  ఇక ఈ చిత్రం పూర్తైన త‌ర్వాత కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో ఓ సినిమా చేయ‌నున్నాడు.   ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. వీటి త‌ర్వాత ఎన్టీఆర్ .. లోకేష్ కనగరాజ్,అట్లీ, సంజయ్ లీలా భన్సాలీ, వక్కంతం వంశీ, నాగ్ అశ్విన్ వంటి దర్శకుల‌తో సినిమా చేస్తాడని గ‌తంలో టాక్ రాగా, ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. హాలీవుడ్‌లో ‘అన్ బ్రేకబుల్’, ది సిక్స్త్ సెన్స్,  గ్లాస్ వంటి సినిమాను తెరకెక్కించిన మనోజ్ నైట్ శ్యామలన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయ‌నున్న‌ట్టు టాక్. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది. 

VIDEOS

logo