శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Nov 22, 2020 , 17:38:03

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'టెనెట్' డిసెంబర్‌ 4న రిలీజ్‌..వీడియో

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'టెనెట్' డిసెంబర్‌ 4న రిలీజ్‌..వీడియో

క్రిస్టోఫ‌ర్ ఎడ్వర్డ్ నోల‌న్ డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న యాక్షన్ థ్రిల్ల‌ర్ టెనెట్‌. సైన్స్ ఫిక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో జాన్ డెవిడ్ వాషింగ్ట‌న్‌, రాబ‌ర్ట్ పాటిన్స‌న్‌, డింపుల్ క‌పాడియాతోపాలు ప‌లువురు నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం క‌రోనా మ‌హమ్మారితో  ఆల‌స్య‌మైంది. మూవీ ల‌వ‌ర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ విడుద‌ల తేదీ ఫిక్స్ అయింది. డిసెంబ‌ర్ 4న ఇండియాతోపాటు వ‌రల్డ్ వైడ్ గా విడుద‌ల‌వుతోంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాష‌ల్లో టెనెట్ సంద‌డి చేయ‌నుంది.

టెనెట్ లో‌. కీ రోల్ చేస్తోన్న బాలీవుడ్ న‌టి డింపుల్ క‌పాడియా ఈ విష‌యాన్ని త‌న కూతురు, న‌టి ట్వింఖిల్ ఖ‌న్నా ఇన్ స్టాగ్రామ్ పేజీ ద్వారా షేర్ చేసుకుంది. క్రిస్టోఫ‌ర్ నోల‌న్ డైరెక్ట్ చేసిన టెనెట్ చిత్రం డిసెంబ‌ర్ 4 మీ ముందుకొస్తుంద‌ని చెప్ప‌డం ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టుతో అసోసియేట్ కావ‌డం గౌర‌వంగా భావిస్తున్నా. అద్బుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో సాగే ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 4న‌ బిగ్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయండి.. వీడియో ద్వారా సందేశాన్ని తెలిపింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.