మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 15:27:18

ల‌క్ష్మీదేవిని ఆరాధిస్తున్న హాలీవుడ్ న‌టి

ల‌క్ష్మీదేవిని ఆరాధిస్తున్న హాలీవుడ్ న‌టి

హిందూ దేవ‌త‌ల‌ని, మ‌న సంప్ర‌దాయాల‌ని హాలీవుడ్ స్టార్స్ ఎంత‌గానో ప్రేమిస్తారు, ఆరాధిస్తారు. గ‌తంలో ఎంద‌రో స్టార్స్ మ‌న  పండుగ‌లు, దేవ‌త‌లు, కట్టుబొట్టు గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. జులియా రాబ‌ర్ట్స్‌, మిలీ సిర‌స్ గ‌తంలో హిందూ దేవ‌త‌ల గురించి గొప్ప‌గా చెప్పారు. తాజ‌గా హాలీవుడ్ న‌టి స‌ల్మా హ‌యెక్ లక్ష్మీదేవి గురించి గొప్ప‌గా చెప్పింది. ఆమె ధ్యానంలో కూర్చున్న‌ప్పుడు లక్ష్మీ దేవిపైనే దృష్టి పెడుతుంద‌ని పేర్కొంది. 

మెక్సిక‌న్ బ్యూటీ స‌ల్మా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ల‌క్ష్మీ దేవి ఫోటోని షేర్ చేస్తూ.. హిందూ దేవ‌త ల‌క్ష్మీ దేవితో త‌న‌కున్న అనుబంధాన్ని రాసుకొచ్చింది. నేను అంతః సౌంద‌ర్యంతో అనుసంధానం కావాల‌నుకున్న‌ప్పుడు ధ్యానం చేయ‌డం ప్రారంభిస్తాను. హిందూ మ‌తానికి చెందిన వారు ల‌క్ష్మీ దేవిని సంప‌ద‌, అదృష్టం, ప్రేమ‌, అందం, శ్రేయ‌స్సు, ఆనందంకు ప్ర‌తినిధిగా భాఇవిస్తారు. ఆమె ఫోటో నాకు ఎంతో ఆనందాన్ని క‌లిగిస్తుంది. సంతోషం, ప్ర‌శాంత‌త ఆమె అంతః సౌంద‌ర్యానికి బాట‌లు వేస్తాయంటూ స‌ల్మా పేర్కొంది. 
logo