బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 22, 2020 , 07:03:33

ల‌క్ష‌ణాలు లేవు, రిపోర్ట్ మాత్రం పాజిటివ్ : న‌టుడు

ల‌క్ష‌ణాలు లేవు, రిపోర్ట్ మాత్రం పాజిటివ్ : న‌టుడు

క‌రోనా భ‌యంతో ప్ర‌పంచ వ‌ణికిపోతుంది. సినీ ప‌రిశ్ర‌కి చెందిన న‌టీన‌టుల‌ని కూడా క‌రోనా తెగ ఇబ్బందిపెడుతుంది. క‌రోనాతో ఇబ్బంది ప‌డుతున్న సెల‌బ్స్ త‌మ సోష‌ల్ మీడియా ద్వారా అనుభ‌వాల‌ని షేర్ చేసుకుంటున్నారు. తాజాగా హాలీవుడ్ ప్రముఖ నటుడు ఇడ్రిస్ ఎల్బా.. త‌న‌కి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని చెబుతూ, ఆ ల‌క్ష‌ణాలు మాత్రం లేవ‌ని అంటున్నాడు. ప్ర‌స్తుతం ఐసోలేష‌న్ వార్డులోతాను  చికిత్స పొందుతున్న‌ట్టు పేర్కొన్నాడు. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌కుండా జాగ్ర‌త్త పాటించాల‌ని అంటున్నాడు ఇడ్రిస్‌.

ఎంత కాలం నుండి మీకు ఇలా ఉంద‌ని నెటిజ‌న్ ఇడ్రిస్‌ని ప్ర‌శ్నించ‌గా, త‌న‌కి ఆదివారం పాజిటివ్ వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం తాను క్షేమంగానే ఉంటున్న‌ట్టు తెలిపిన ఇడ్రిస్ .. తన భార్యను తన నుంచి దూరంగా ఉండమని అందరూ సలహా ఇచ్చారు. ఆమెకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించామని ఆమెకు ఈ వైరస్ సోకలేదని  ప్రస్తుతానికి అంతా బాగుంది అని ఎవరు ఖంగారు పడాల్సిన అవసరం లేదు అని తెలిపారు. క‌రోనా నేప‌థ్యంలో మోదీ ఈ రోజు జ‌న‌తా క‌ర్ఫ్యూకి పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే.


logo