శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 27, 2020 , 09:30:15

మ‌రో తెలుగు చిత్రంపై బాలీవుడ్ నిర్మాత‌ల క‌న్ను..!

మ‌రో తెలుగు చిత్రంపై బాలీవుడ్ నిర్మాత‌ల క‌న్ను..!

తెలుగు సినిమా స్థాయి బాగా పెర‌గ‌డంతో మ‌న చిత్రాలు వేరే వేరే భాష‌ల‌లో రీమేక్ అవుతూ వ‌స్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాత‌లు .. మ‌న సినిమాల‌ని రీమేక్ చేసేందుకు ఎంత‌గానో ఆస‌క్తి చూపుతున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం ఇప్ప‌టికే అక్క‌డ రీమేక్ అయి మంచి విజ‌యం సాధించ‌గా,  ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ ‘ఎవడు’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల రైట్స్ ను కొనేశారు. ఇందులో కొన్ని చిత్రాలు సెట్స్ పై కూడా ఉన్నాయి.

ఇక ఇటీవ‌ల టాలీవుడ్‌లో విడుద‌లై బాక్సాఫీస్‌ని షేక్ చేసిన  ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం  నాని నిర్మించిన ‘హిట్’ మూవీ కూడా హిందీలో  రీమేక్ కానుందట.విశ్వ‌క్ సేన్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన  ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందుకే హిందీలోకి కూడా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాతలు.


logo