మంగళవారం 24 నవంబర్ 2020
Cinema - Oct 21, 2020 , 14:18:11

యురి, గ‌ల్లీభాయ్‌, సూప‌ర్ 30 సినిమాల‌కు అవార్డులు

యురి, గ‌ల్లీభాయ్‌, సూప‌ర్ 30 సినిమాల‌కు అవార్డులు

కేంద్ర స‌మాచార, ప్ర‌సార మంత్రిత్వ శాఖ హిందీతోపాటు వివిధ ప్రాంతీయ భాష‌ల సినిమాల‌కు అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. హిందీలో విక్కీ కౌశ‌ల్ న‌టించిన యురి, ర‌ణ్‌వీర్ సింగ్ న‌టించిన గ‌ల్లీభాయ్, హృతిక్ రోష‌న్ లీడ్ రోల్ లో వ‌చ్చిన సూప‌ర్ 30, బ‌ఢాయ్ హో, ప‌రీక్షా, బ‌హ‌ట్టైన్ హురెయిన్ చిత్రాల‌కు అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. ఇండియ‌న్ ప‌నోర‌మా విభాగంలో 51వ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా అవార్డుల‌ను ఎంపిక చేసింది. 

ఆదిత్యాధ‌ర్ డైరెక్ష‌న్ లో వైమానిక దాడుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన 'యురి..ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్' బాక్సాపీస్ సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. జోయా అక్త‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'గ‌‌ల్లీభాయ్' సినిమాలో ర‌న్ వీర్ సింగ్ త‌న న‌ట‌న‌తో అందరినీ ఆక‌ట్టుకున్నాడు. ఆయుష్మాన్ ఖురానా, నైనా గుప్తా కాంబినేష‌న్ లో అమిత్ శ‌ర్మ డైరెక్ట్ చేసిన కామెడీ డ్రామాగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది 'బ‌ఢాయ్ హో'. ప్ర‌కాశ్ డైరెక్ష‌న్ లో ఆదిల్ హుస్సేన్‌, ప్రియాంకా బోస్ న‌టించిన 'ప‌రీక్షా' విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.