ఒకప్పుడు సీరియల్స్‌తో పాటు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన హిమజ ఇప్పుడు స్టార్ స్టేటస్ పొందింది. బిగ్ బాస్ షో వలన ఈ అమ్మడికి చాలా గుర్తింపు రాగా, దానిని బాగా క్యాష్ చేసుకుంటుంది. అంతేకాదు తన లైఫ్ స్టైల్ కూడా చాలా రిచ్‌గా ఉండేలా చూసుకుంటుంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక కొత్త బంగ్లా కనుగోలు చేసిన హిమజ కొద్ది రోజులకు బెంజ్ కారు కొనింది. తాజాగా తన ఖాతాలో మరో కారు వచ్చి చేరినట్టు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
నటిగా 10కి పైగా సినిమాలు చేసిన హిమజ బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. తాజాగా ఈ అమ్మడు మహీంద్రా థార్ వాహనాన్ని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్‌స్టాలో షేర్ చేయగా, ఆమెకు సన్నిహితుల నుండే కాక పలువురు సెలబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కారు ధర దాదాపుగా 13 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయలు ఖరీదు ఉంటుందట.