బిగ్‌బాస్ ఫేమ్ హిమజ, ప్రతాప్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జ’. సైదిరెడ్డి చిట్టెపు దర్శకుడు. గోవర్ధన్ రెడ్డి కందుకూరి నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం హీరో సుధీర్‌బాబు విడుదల చేశారు. కథానాయిక హిమజ మాట్లాడుతూ ‘అభినయానికి ఆస్కారమున్న పాత్రను ఈ చిత్రంలో పోషించాను. నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రం ఇది’ అన్నారు. ప్రీతి నిగమ్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: వెంగి.