బుధవారం 03 జూన్ 2020
Cinema - May 22, 2020 , 12:43:01

బుల్లితెర‌పై దుమ్ము రేపిన‌ అశ్వ‌థ్థామ

బుల్లితెర‌పై దుమ్ము రేపిన‌ అశ్వ‌థ్థామ

నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లో నూతన దర్శకుడు రమణ తేజ తెర‌కెక్కించిన చిత్రం అశ్వ‌థ్థామ . ఓ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్ర కథను స్వయంగా నాగ శౌర్య సమకూర్చగా,ఉషా ములుపూరి నిర్మించారు. మెహ్రీన్ క‌థానాయిక‌గా న‌టించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంత‌గా ప్రభావం చూప‌క‌పోయిన బుల్లితెర‌పై మాత్రం సంచ‌ల‌నం సృష్టించింది. 

 యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన అశ్వ‌థ్థామ చిత్ర శాటిలైట్ రైట్స్  జెమినీ ద‌క్కించుకుంది. గ‌త‌వారం బుల్లి తెరపై ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా భారీ టి ఆర్ పి దక్కిచుకుంది. తాజాగా విడుదల చేసిన రిపోర్ట్స్ ప్రకారం అశ్వథామ మూవీ 9.10 టి ఆర్ పి దక్కించుకొని అబ్బురపరిచింది. ఇది నాగ శౌర్య గత చిత్రాల అన్నింటికీ మించినది కావడం గమనార్హం.  శ్రీచరణ్ పాకల సంగీతం అందించారు. అశ్వ‌థ్థామ మూవీ ప్రస్తుతం సన్ నెక్స్ట్ లో అందుబాటులో ఉంది.


logo