అశ్విన్‌బాబు, నందితాశ్వేత జంటగా నటిస్తున్న చిత్రం ‘హిడింబ’. గంగపట్నం శ్రీధర్ నిర్మాత. అనిల్‌కృష్ణ కన్నెగంటి దర్శకుడు. ఆదివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఇందులో శత్రువులతో యుద్ధానికి సిద్ధమై ఇంటెన్స్ లుక్‌లో అశ్విన్‌బాబు కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘పురాణాల్లోని శక్తివంతమైన రాక్షసరాజు హిడింబను పోలి హీరో పాత్ర సాగుతుంది. ఈ పాత్ర కోసం అశ్విన్‌బాబు తన లుక్, ఆహార్యాన్ని పూర్తిగా మార్చుకున్నారు. యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అని తెలిపారు. శ్రీనివాసరెడ్డి, సాహితి, సంజయ్ స్వరూప్, సిజ్జు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం వికాస్ బడిసా, సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్.