శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 17, 2021 , 13:42:19

ప్ర‌భాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్ష‌న్..!

ప్ర‌భాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్ష‌న్..!

పాన్ ఇండియా క‌థాంశం నేప‌థ్యంలో స‌లార్ సినిమా చేస్తున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ మూవీ జ‌న‌వ‌రి 15న గ్రాండ్‌గా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. జ‌న‌వ‌రి చివ‌రి వారం నుంచి షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌య‌మే కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిపోయింది. చాలా మంది స్టార్ హీరోయిన్లు త‌మ కొత్త చిత్రాల‌తో బిజీగా ఉండ‌టంతో మేక‌ర్స్ కు టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌.

ఏ లిస్ట‌ర్స్ గా ఉన్న టాప్‌ హీరోయిన్లు బిజీగా ఉండ‌టంతో హీరోయిన్ ఎంపిక ప్ర‌క్రియ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. పాన్ ఇండియా స్టార్ కావ‌డంతో ప్ర‌భాస్ తో ప్ర‌స్తుతం బాలీవుడ్ హీరోయిన్ల‌యితేనే ప‌క్కాగా సెట్ట‌వుతారు. ఇప్ప‌టివ‌రకు బాలీవుడ్ అందాల భామ దిశాప‌టానీ పేరు ప్ర‌ముఖంగా వినిపించినా..దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. మ‌రి ప్ర‌భాస్ తో క‌లిసి న‌టించే అరుదైన ఛాన్స్ ఎవ‌రు కొట్టేస్తారో చూడాలి.

రాధేశ్యామ్ చిత్రంతోపాటు ఆదిపురుష్ స‌హా మ‌రో చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టాడు. రాబోయే కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా కానున్నాడు ప్ర‌భాస్.


మ‌రిది కోసం సినిమా సెట్ చేసిన స‌మంత‌..!

ఆర్మీ ఆఫీస‌ర్ గా సోనూసూద్..మ్యూజిక్ వీడియో

ర‌వితేజకు రెమ్యున‌రేష‌న్ ఫార్ములా క‌లిసొచ్చింది..!

మ‌రో క్రేజీ ప్రాజెక్టులో స‌ముద్ర‌ఖ‌ని..!


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo