బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 28, 2020 , 13:10:48

ఛలో మాల్దీవ్స్.. ఆ ద్వీపంలో చిల్ అవుతున్న హీరోయిన్స్

ఛలో మాల్దీవ్స్.. ఆ ద్వీపంలో చిల్ అవుతున్న హీరోయిన్స్

మాల్దీవ్స్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు ఇది. చుట్టూ సముద్రం.. మధ్యలో ఓ ద్వీపం.. అక్కడే అందమైన ప్రదేశాలు.. ఇసుక తెన్నెలు.. వెన్నెల సాయంత్రాలు ఇవన్నీ అక్కడ ఉంటాయి. దాంతో ఈ భూతల స్వర్గానికి వెళ్లడానికి క్యూ కడుతున్నారు మన హీరోయిన్లు. హీరోలు ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నారు కానీ హీరోయిన్ల అడుగులు మాత్రం అందరివీ ఒకే చోట పడుతున్నాయి. ఎక్కువ ఆలోచించకుండా టైమ్ దొరికితే వెంటనే ఛలో మాల్దీవ్స్ అంటున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. అందరి అడుగులు అక్కడే పడుతున్నాయి. పెళ్లి చేసుకుని మొన్నటికి మొన్న కాజల్ అగర్వాల్ కూడా మాల్దీవ్స్ వెళ్లింది. అక్కడే వారం రోజుల పాటు తన హనీమూన్ జరుపుకుంది. సముద్ర స్నానాలు చేసుకుంటూ.. సముద్రం లోపల అద్దాల మేడలో ఉంటూ.. భర్తకు ముద్దులు పెట్టుకుంటూ రకరకాల పోజులు ఇచ్చింది. 

మొన్న సమంత కూడా తన భర్త నాగ చైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుంది. ఈమె బికినీ ట్రీట్ కూడా పిచ్చెక్కించింది అభిమానులను. ఇప్పటికీ అక్కడే ఉంది ఈ భామ. ఏడాదికి కనీసం రెండుసార్లు మాల్దీవ్స్ వెళ్తుంది సమంత. ఆ మధ్య తాప్సీ పన్ను కూడా మాల్దీవ్స్ వెళ్లి బికినీ ట్రీట్ ఇచ్చింది. కుటుంబంతో పాటు అక్కడే కొన్ని రోజులు గడిపింది. రకుల్ ప్రీత్ సింగ్ ఏం తక్కువ తినలేదు. బికినీ వేసుకుని రోజుకో పోజ్ ఇచ్చింది. మాల్దీవ్స్ అంతా తన అందాలతో వేడెక్కించింది. కుటుంబంతో పాటు అక్కడికి వెళ్లిన రకుల్ పిచ్చెక్కించింది. బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా బికినీ ట్రీట్ ఇచ్చింది. సినిమాల కోసం కాస్త హద్దుల్లోనే ఉండే ఈ ముద్దుగుమ్మ.. మాల్దీవ్స్ వెళ్తే మాత్రం అందాలతో మరిపిస్తుంది. 

బాలయ్య రూలర్ హీరోయిన్ వేదిక కూడా అందాల వేదిక పరిచేసింది. మాల్దీవ్స్ సముద్రపు ఒడ్డున మతులు పోగొట్టేసింది. గోవా సుందరి ఇలియానా సైతం మాల్దీవ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఇలా ఒక్కరు ఇద్దరు కాదు.. మాల్దీవ్స్ వైపే మా ప్రయాణం అంటూ హీరోయిన్స్ అంతా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ మాల్దీవ్స్ వెళ్లడానికి పర్ఫెక్ట్. దాంతో వరసగా తమ ఫ్యామిలీతో అక్కడికి ఛలో అంటున్నారు మన హీరోయిన్స్.


logo