శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 23:32:22

సమంత అందరికీ ఆదర్శం

సమంత అందరికీ ఆదర్శం

సాధారణంగా పెళ్లయిన తర్వాత కథానాయికల కెరీర్‌ మందగిస్తుంది. గతంలో మాదిరిగా అవకాశాలు చేజిక్కించుకోవడం అంత సులువు కాదు. అయితే అక్కినేని ఇంటి కోడలు సమంత మాత్రం వివాహానంతరం కూడా వరుస సినిమాలతో సత్తాచాటుతోంది. ఈ విషయంలో సమంత మిగతా కథానాయికలందరికీ ఆదర్శమని చెప్పింది సీనియర్‌ నాయిక ప్రియమణి. ‘ప్రస్తుతం ఇండస్ట్రీ ఆలోచనాధోరణి మారింది. గతంలో కథానాయికలకు నిశ్చితార్థం అని తెలియగానే అవకాశాలు ఇవ్వకపోయేవారు. ఇప్పుడు పెళ్లయిన నాయికలు కూడా భారీ సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంటున్నారు. అందుకు సమంతను ఉదాహరణగా తీసుకోవచ్చు. ప్రేక్షకులతో పాటు పరిశ్రమలో కూడా ఆమెకున్న పేరు ఏమాత్రం తగ్గలేదు. ఫిట్‌నెస్‌పరంగా చక్కటి శ్రద్ధ తీసుకుంటూ నవతరం కథానాయికలా ఆకట్టుకుంటోంది.  పెళ్లయి పోయిన తర్వాత నాకు ఆశించిన అవకాశాలు రావనుకున్నా. కానీ మంచి కథాబలమున్న సినిమాల్లో అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతున్నాయి. హిందీతో పాటు ఓటీటీ సిరీస్‌లో కూడా కెరీర్‌ బాగుంది’ అని చెప్పింది.