గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 13:36:17

హీరో విజయ్‌ దేవరకొండ సరికొత్త రికార్డు...

హీరో విజయ్‌ దేవరకొండ సరికొత్త రికార్డు...

హైదరాబాద్ : విజయ్ దేవరకొండ ఆనతి కాలంలోనే తనదైన మార్కుతో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పని లేదు. తాజాగా ఈ హీరో ఇన్ స్టాగ్రామ్ లో విజయ్ 9 మిలియన్ మార్క్ ను దాటాడు. సౌత్ ఇండియా మొత్తంలో 9 మిలియన్ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ. అది కూడా తను ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంటరైన తక్కువ సమయంలోనే ఈ సంఖ్యను చేరుకోవడం మరో విశేషం.

ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో "ఫైటర్" సినిమా బిజీలో ఉన్నాడు విజయ్. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నది. పెళ్లి చూపులు చిత్రం తో హీరోగా మారి, అర్జున్ రెడ్డి చిత్రం తో యువత హృదయాలను కొల్లగొట్టాడు విజయదేవరకొండ. తక్కువ కాలంలోనే ఎంతో పేరు తెచ్చి పెట్టింది ఈ సినిమా. ఆ తరువాత వచ్చిన గీతా గోవిందం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకున్నది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.