గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 16:32:34

త‌ల్లి పుట్టిన‌రోజుకు స్పెష‌ల్ వీడియోతో.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

త‌ల్లి పుట్టిన‌రోజుకు స్పెష‌ల్ వీడియోతో..  విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

టాలీవుడ్ యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ల్లి మాధ‌వి పుట్టిన‌రోజు వేడుక‌లు ఇంట్లో ఘ‌నంగా జ‌రిగాయి. త‌ల్లికి విషెస్ చెబుతూ విజ‌య్ ఒక వీడియోను త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది నెట్టింట వైర‌ల్ అయింది. ఇందులో త‌ల్లి, సోద‌రుడితోపాటు విజ‌య్ షాట్ కొడుతున్న‌ట్లుగా పోజ్ ఇచ్చారు. త‌ర్వాత హ్యాపీ 50 అంటూ వీడియో ముగుస్తుంది. దీనికి అర్థం. త‌ల్లి నిజ‌జీవితంలో హాఫ్‌సెంచ‌రీ పూర్తి చేసుకుం‌ది అన్న‌మాట‌. 'నువ్వెప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకుంటాన‌మ్మా' అంటూ భావోద్వేగ‌భ‌రిత‌మైన శీర్షిక‌ను జోడించాడు విజ‌య్‌.

అయితే త‌ల్లి పుట్టిన‌రోజు వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా న‌లిచింది మ‌రెవ‌రో కాదు. గీత గోవిందం బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న. త‌న‌తోపాటు విజ‌య్ కుటుంబ స‌భ్యులు, బంధువులు క‌లిసి దిగిన ఫోటోను అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు‌. ఇక‌పోతే పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఫైట‌ర్‌లో విజ‌య్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీనిని బాలీవుడ్‌లో ఈ సినిమాను ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కనిర్మాత క‌ర‌ణ్ జోహార్ సమ‌ర్పిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ ద‌ర్శ‌కనిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీతో విజ‌య్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు బీటౌన్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


logo