బుధవారం 27 జనవరి 2021
Cinema - Nov 10, 2020 , 15:37:39

క‌రోనాతో వ‌రుణ్ సందేశ్ తాత మృతి!

క‌రోనాతో వ‌రుణ్ సందేశ్ తాత మృతి!

క‌రోనా మ‌హ‌మ్మారి ఎంతో మంది ప్ర‌ముఖుల‌ని పొట్ట‌న పెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం లెజండ‌రీ గాయ‌కుడు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం క‌రోనా క‌న్నుమూయ‌గా, తాజాగా వ‌రుణ్ సందేశ్ తాత‌, ప్ర‌ముఖ ర‌చ‌యిత జీడిగుంట‌ రామ‌చంద్ర‌మూర్తి తుది శ్వాస విడిచారు. ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

జీడిగుంట‌ రామ‌చంద్ర‌మూర్తి .. రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు,  నవలలు, సినిమాలకు సంభాషణలు,  అనువాద వ్యాసాల రచన...  ఇలా అన్నింట్లో తన కలానికున్న సత్తా చాటారు    ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని ఆకాశవాణిలో అడుగుపెట్టి పదవీ విరమణ వరకు అందులోనే ఉండిపోయారు.  

ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన అమెరికా అబ్బాయి సినిమాకు కథ రాసారు జీడిగుంట‌. దుక్కిపాటిగారికి రేడియో వాళ్లంటే ఎంతో అభిమానం. ఆ చిత్రానికి ప్రముఖ రేడియో ఆర్టిస్ట్ ఎర్రమనేని చంద్రమౌళి మాటలు రాశారు. తర్వాత ఈ ప్రశ్నకు బదులేది, పెళ్లిళ్లోయ్ పెళ్లిళ్లు అనే సినిమాలకు సంభాషణలు రాశారు. మరో మాయాబజార్, అమృత కలశం చిత్రాలకు సహ రచయితగా వ్యవహరించారు. టెలివిజన్ లో బాగా ప్రేక్షకాదరణ పొందిన ‘మనోయజ్ఞం’ సీరియల్‌కు 40 ఎపిసోడ్లకు స్క్రిప్ట్ రాశారుlogo