ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 14:33:04

ఎయిట్‌ ప్యాక్స్‌ కోసం ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట!

ఎయిట్‌ ప్యాక్స్‌ కోసం ఐదు రోజులు నీళ్లు కూడా తాగలేదట!

యువ నటుడు నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వర్కింగ్‌ టైటిల్‌ ఎన్‌ఎస్‌20. స్పోర్ట్స్‌ డ్రామాగా రానుండగా.. ఇందులో విలుకాడిగా శౌర్య కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఎయిట్‌ పాక్స్‌ కోసం చాలా కష్టడ్డాడు. లాక్‌డౌన్‌ రోజుల్లో కూడా అతను తన డైట్‌ని క్రమం తప్పకుండా పాటించాడు. జిమ్‌లో సైతం ప్రతి రోజూ చెమటోడ్చాడు. చిత్రం షూటింగ్‌ ఇటీవల హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైంది. కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్‌లో సాగుతోంది. ఈ సన్నివేశాలకు నాగశౌర్య తన ఎయిట్‌ ప్యాక్‌ బాడీని ప్రదర్శించాల్సి ఉంది. ఫిట్ బాడీని మెయింటైన్ చేయడం అంత తేలిక కాదు. శౌర్య నీటిని తాగడం ఆపివేశాడట. ఐదు రోజులుగా లాలాజలం కూడా మింగడం లేదు. ఇది నమ్మశక్యంగా లేదు కానీ నిజం. ఇది సినిమా పట్ల ఆయనకున్న అభిరుచిని తెలియజేస్తుందని చిత్రబృందం అంటున్నది. చిత్రంలో కేతికాశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నారాయణ దాస్‌ నారంగ్‌, శరత్‌ మరార్‌, పీ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. 


logo