బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 17:48:58

మ‌ణికొండ‌లోని ఆ స్కూల్ మీద హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేసిన శివ బాలాజీ!

మ‌ణికొండ‌లోని ఆ స్కూల్ మీద హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు  చేసిన శివ బాలాజీ!

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా స్కూళ్ల‌న్నీ మూత‌బ‌డ్డాయి. రెండు, మూడు నెల‌లు చూసినా క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోయేస‌రికి ప్ర‌భుత్వం పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించ‌మ‌ని ఆదేశ‌మిచ్చింది. దీంతో అప్ప‌టి నుంచి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల హీరో శివ‌బాలాజీ పిల్ల‌లు ఆన్‌లైన్ క్లాసుల‌కు అటెండ్ కాకుండా ఉండేందుకు తమ ఐడీల‌ను 'మౌంట్ లిటేరా జీ స్కూల్' బ్లాక్ చేసింద‌ని 'మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ '(హెచ్ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. దీని గురించి యాజ‌మాన్యాన్ని హెచ్చ‌రిస్తే బెదిరిస్తున్నార‌ని వాపోయారు.

క్లాసులు పేరుతో అధిక మొత్తంలో డ‌బ్బు వ‌సూళ్లు  చేస్తున్నారు. డౌట్ రాకుండా ఉండేందుకు అన‌వ‌స‌రంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎందుక‌ని ప్ర‌శ్నిస్తే వారి పిల్ల‌ల ఐడీల‌ను బ్లాక్ చేస్తున్నార‌ని హ‌క్కుల క‌మిష‌న్ ముందు చెప్పుకొచ్చారు. ఇది నా ఒక్క‌డి ప‌రిస్థితి కాదు. నాలా చాలామంది స‌ఫ‌ర్ అవుతున్నార‌ని పేర్కొన్నారు. క‌నీసం ప్ర‌భుత్వ ఆదేశాల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డంలేదంటున్నారు.  


logo