కొంత విరామం తరువాత హీరో సాయిరామ్‌శంకర్ నటిస్తున్న నూతన చిత్రానికి ‘రీసౌండ్’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఎస్ఎస్ మురళీ దర్శకత్వంలో సురేష్ రెడ్డి, అయ్యప్ప రాజు, ఎన్వీఎన్ రాజారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీ సింగ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం హీరో సాయిరామ్‌శంకర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. అరవింద్‌కృష్ణ, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్ అగస్తి