బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 13:45:03

కేటీఆర్‌ని క‌లిసి రూ.25 ల‌క్ష‌ల‌ చెక్ అందించిన హీరో రామ్

కేటీఆర్‌ని క‌లిసి రూ.25 ల‌క్ష‌ల‌ చెక్ అందించిన హీరో రామ్

గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో నిరాశ్ర‌యులైన వారికి సినీ ప‌రిశ్ర‌మ కూడా అండ‌గా నిలిచింది. చిరంజీవి, మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్, రామ్, విజ‌య్ దేవ‌ర‌కొండ త‌దిత‌రులు త‌మ వంతు సాయంగా విరాళాలు అందించారు.  ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపు మేర‌కు  యువ హీరో రామ్ పోతినేని సీఎం స‌హాయ నిధికి రూ.25 ల‌క్ష‌లు విరాళ‌మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి..గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. 

కొద్ది సేప‌టి క్రితం హీరో రామ్ కేటీఆర్‌ని క‌లిసి రూ. 25 ల‌క్ష‌ల చెక్ అందించారు. ఆయ‌న మంచి మ‌న‌సుపై నెటిజ‌న్స్ ప్ర‌శంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే  అక్టోబ‌ర్ 20న రామ్ విరాళం ఇవ్వనున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  నా తెలంగాణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి గురించి ఆందోళ‌న చెందుతున్నా. వ‌ర‌ద‌లు వ‌చ్చిన మొద‌టి రోజు నుంచి క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించడం సంతోషకర విష‌యం. వ‌ర‌ద బాధితుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న సేవ‌లు ప్ర‌శంసనీయం. ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి నా వంతుగా రూ.25 ల‌క్ష‌లు విరాళంగా అంద‌జేస్తున్నాన‌ని రామ్ ట్వీట్ చేశారు.