గురువారం 04 జూన్ 2020
Cinema - May 07, 2020 , 12:42:04

వెబ్ సిరీస్‌లో యువ హీరో..!

వెబ్ సిరీస్‌లో యువ హీరో..!

ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌ల‌కి మంచి డిమాండ్ ఏర్పిడింది. ఈ పరిస్థితిని గ‌మ‌నించిన స‌మంత ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈమె బాట‌లోనే ప‌లువురు స్టార్స్ వెబ్ సిరీస్‌ల‌లో న‌టించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. తాజాగా త‌మిళ హీరో జై కూడా వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆస‌క్తి చూపుతున్నాడ‌ట‌.

డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ద‌గ్గ‌ర ప‌ని చేసే అసోసియేట్ డైరెక్టర్ త్వ‌ర‌లో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. దీనిని కార్తీక్ సుబ్బరాజ్ హోమ్ ప్రొడక్షన్స్ అయిన 'స్టోన్ బెంచ్ ప్రొడక్షన్స్' నిర్మించనుంది. డిస్నీ హాట్ స్టార్‌లో ప్ర‌ద‌ర్శితం కానున్న ఈ వెబ్ సిరీస్‌లో జై తో పాటు వాణి భోజన్ అనే న‌టించ‌నుంద‌ని తెలుస్తుంది. వాణి చివ‌రిగా  తెలుగులో మీకు మాత్రమే చెప్తా సినిమాతో అలరించింది 


logo