పూర్వజన్మ కృతం పాపం
వ్యాధి రూపేణ పీడ్యతే
తచ్ఛాంతి రౌషధై ర్దానైః
జపహోమ సూరార్చనైః
పూర్వజన్మలో చేసిన పాపము వ్యాధి రూపంలో బాధిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ జన్మలో చేసిన పాపము ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుంది. ‘అత్యుత్కటైః పుణ్య పాపైరిహైవ ఫల మశ్నుతె’ అని కూడా అన్నారు. అట్టి పాప ఫలము వ్యాధి రూపంలో అనుభవించవలసి వచ్చినప్పుడు అది శాంతించుటకు ఔషధ సేవనం మొదట చేయాలి. ఆ తర్వాత వరుసగా దానము, భగవన్నామ జపము, హోమము, దేవతాపూజ.. వీటి ద్వార అట్టి వ్యాధి త్వరగా తగ్గి ఆరోగ్యము చేకూరగలదు.
టి.సుధాకరశర్మ