ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 26, 2020 , 12:40:33

బాలుకు భార‌త ర‌త్న ఇవ్వాలి- అర్జున్

బాలుకు భార‌త ర‌త్న ఇవ్వాలి- అర్జున్

గాయ‌కుడిగా ఎన్నో శిఖ‌రాల‌ని అధిరోహించిన గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తిరిగి రాని లోకాల‌కు వెళ్ళారు. ఆయ‌నని క‌డ‌సారి చూసేందుకు తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌కు వ‌చ్చిన అర్జున్ నివాళులు అర్పించిన త‌ర్వాత‌ మీడియాతో మాట్లాడారు. బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇందుకోసం తెలుగు, మ‌ల‌యాళ‌, త‌మిళం ఇండ‌స్ట్రీలు అన్ని క‌లసి రావాలి. 45 వేల పాట‌లు రెండు జ‌న్మ‌లు ఎత్తిన పాడ‌లేరు అని అర్జున్ పేర్కొన్నారు. 

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) వంటి వ‌టవృక్షం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఎస్పీ బాలు మరణం పట్ల రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, వైఎస్‌ జగన్‌ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.


logo