శనివారం 29 ఫిబ్రవరి 2020
రానా 'అర‌ణ్య' టీజ‌ర్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్

రానా 'అర‌ణ్య' టీజ‌ర్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్

Feb 14, 2020 , 08:29:52
PRINT
రానా 'అర‌ణ్య' టీజ‌ర్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్

బాహుబ‌లి సినిమాలో భ‌ళ్ళాల దేవుడి పాత్ర పోషించిన రానా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో మెప్పించాడు. మ‌ళ్ళీ అలాంటి పాత్ర‌లో న‌టిస్తున్నాడు.  ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్  నిర్మిస్తున్న ‘అరణ్య’  చిత్రంలో రానా లుక్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంది. మావటివాడి పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌నున్నారు . తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం నిర్మితమవుతోంది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాండన్’ టైటిల్స్‌తో తెరకెక్కిస్తున్నారు.  ప్రభు సాల్మన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘థోర్‌’, ‘బై మోక్ష్‌ బక్షి’ వంటి చిత్రాలకు వి.ఎఫ్‌.ఎక్స్‌ అందించిన ప్రాణ స్టూడియో ఈ సినిమాకు వి.ఎఫ్‌.ఎక్స్‌ చేస్తుంది. ‘త్రీ ఇడియట్స్’‌, ‘పీకే’, ‘పింక్‌’, ‘వజీర్‌’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన శాంతను మోయిత్ర ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ విజేత రసూల్‌ పూకుట్టి ఈ చిత్రానికి సౌండ్‌ డిజైనింగ్‌ చేస్తున్నారు. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ఇందులో స‌న్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. రానా పాత్ర భారత సినీ చరిత్రలో నిలిచిపోయేలా క‌నిపిస్తుంది. చిత్రంలో తమిళ నటుడు విష్ణు విశాల్, ప్రభు సాల్మోన్, శ్రియ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌స్తుంది. ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు గ్రహీత కాగా, ఈ సినిమాలో రానాతో పాటు తమిళ నటుడు విష్ణు విశాల్, ప్రభు సాల్మోన్, శ్రియ ఇత‌ర పాత్ర‌లు పోషించారు. ఏప్రిల్ 2న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు. logo