సోమవారం 28 సెప్టెంబర్ 2020
Cinema - Aug 14, 2020 , 10:30:34

‘ఇంద్ర‌ప్ర‌స్థం’ ఫిక్ష‌నల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఇంద్ర‌ప్ర‌స్థం’ ఫిక్ష‌నల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ పోస్ట‌ర్ విడుద‌ల‌

వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ద‌ర్శ‌కుడు దేవా క‌ట్ట ప్ర‌స్తుతం ఫిక్ష‌న‌ల్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థ‌ని సిద్దం చేశాడు. ఇందులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ముఖ్య‌మంత్రులుగా ప‌ని చేసిన చంద్ర‌బాబు నాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ధ్య స్నేహం, రాజ‌కీయ వైరంకి సంబంధించిన అంశాల‌ని ఆస‌క్తిక‌రంగా చూపించ‌నున్నాడు. కొద్ది సేప‌టి క్రితం చిత్ర థీమ్ పోస్ట‌ర్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

ఇంద్ర‌ప్ర‌స్థం అనే టైటిల్‌ని చిత్రానికి ఫిక్స్ చేసిన దేవా క‌ట్టా పోస్ట‌ర్‌లో సీబీఎన్‌, వైఎస్ఆర్‌ని పోలిన షేడ్స్  ఇమేజ్ చూపించారు. వీడియోలో ‘ప్ర‌పంచంలో జ‌రిగే పోటీల‌న్నీ విన్న‌ర్స్‌ని ఎంచుకోవ‌డం కోస‌మే . ఇద్ద‌రు స్నేహితులు ఓ పోటీలో పాల్గొన్న‌ప్పుడు అది చాలా ఆస‌క్తిక‌రంగా మారుతుంది’ అనే డైలాగ్‌ను విడుద‌ల చేశారు. ఈ డైలాగ్ దేవా క‌ట్ట వాయిస్ తో ఉంది.  ప్రూడోస్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై హ‌ర్ష‌.వి, తేజ‌.సి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. ప్ర‌స్తుతం దేవా క‌ట్టా.. సాయి తేజ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. 
logo