శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 21, 2021 , 19:44:40

మ‌హేశ్ బాబు దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

మ‌హేశ్ బాబు దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

ఇటీవ‌లే యూఎస్ నుంచి తిరిగొచ్చిన మ‌హేశ్‌బాబు అండ్ ఫ్యామిలీ మ‌ళ్లీ ఫారిన్ ట్రిప్ వేసింది. మ‌హేశ్ స‌డెన్ గా ఫ్యామిలీతో క‌లిసి దుబాయ్ ట్రిప్ వేశాడు. మ‌హేశ్ స‌ర్కారు వారి పాట షూటింగ్‌లో జాయిన్ అవుతాడ‌ని అభిమానులు భావించారు. మహేశ్ మాత్రం హఠాత్తుగా న‌మ్ర‌త‌, సితార‌, గౌత‌మ్ తో హైద‌రాబాద్ లో ప్ర‌త్యక్ష‌మ‌య్యేస‌రికి ఫొటోగ్రాఫ‌ర్లు వారిని క్లిక్‌మ‌నిపించారు. ఇంత‌కీ మ‌హేశ్ దుబాయ్‌కు వెళ్లింది ఎందుకో తెలుసా..? జ‌న‌వ‌రి 22న మ‌హేశ్ వైఫ్ న‌మ్ర‌త బ‌ర్త్ డే.

దుబాయ్‌లో న‌మ్ర‌త పుట్టిన‌రోజును సెల‌బ్రేట్ చేసేందుకు ప్లాన్ చేశాడ‌ట మ‌హేశ్‌. ఈ సూప‌ర్‌స్టార్ ఓ వైపు న‌మ్ర‌త పుట్టిన‌రోజును గ్రాండ్ గా జ‌రుపుతూనే అభిమానుల కోసం స‌ర్కార్ వారు పాట చిత్రీక‌ర‌ణ‌లో కూడా పాల్గొన‌బోతున్నాడు. అవును మీరు విన్న‌ది నిజమే. దుబాయ్‌లో జ‌న‌వ‌రి 29న లేదా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో షూటింగ్ మొద‌లు కానుందని స‌మాచారం. డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేశాడు.

ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా..షూటింగ్ కోసం డేట్స్ కూడా కేటాయించిందట‌. మ‌హేశ్ ఎయిర్ పోర్టులో దిగిన ఫొటోలు ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


ఇవి కూడా చ‌ద‌వండి..

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

చిరంజీవి ఆ రీమేక్ ను ప‌క్క‌న పెట్టాడా..?

పాయ‌ల్ రాజ్‌పుత్‌.. ఈ ముద్దుల క‌హానీ ఏంటి?

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo