గురువారం 21 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 13:53:39

'నార‌ప్ప' ఫ్యామిలీ అదిరిపోయింది..సంక్రాంతి పోస్ట‌ర్

'నార‌ప్ప' ఫ్యామిలీ అదిరిపోయింది..సంక్రాంతి పోస్ట‌ర్

టాలీవుడ్ యాక్ట‌ర్ వెంక‌టేశ్ సినిమా అంటే చాలు థియేట‌ర్ల‌కు జ‌నాల తాకిడి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. వెంకీ న‌టిస్తోన్న కొత్త చిత్రం నార‌ప్ప‌. త‌మిళంలో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అసుర‌న్ కు తెలుగు రీమేక్ ఇది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది.  వెంక‌టేశ్, ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా..కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఫేం కార్తీక్ ర‌త్నం కీ రోల్ చేస్తున్నారు.

తాజాగా సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్ స‌రికొత్త లుక్ ను విడుద‌ల చేశారు.  వెంక‌టేశ్, ప్రియ‌మ‌ణి ఫ్యామిలీ అంతా ఉన్న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. వెంకీ గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని విధంగా ఇలా ఫ్యామిలీతో క‌లిసి కొత్త‌గా కనిపిస్తున్నాడు. పోస్ట‌ర్ లో కార్తీక్ ర‌త్నం స‌హా వెంకీ ఫ్యామిలీ అంతా హాయిగా న‌వ్వుడం చూడొచ్చు. ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన లుక్స్ సినిమాపై అంచ‌నాల‌ను రోజురోజుకీ పెంచేస్తున్నాయి. రావు ర‌మేశ్‌, ప్ర‌కాశ్‌రాజ్, ముర‌ళీ శ‌ర్మ‌, సంప‌త్ రాజ్‌, రాజీవ్ క‌న‌కాల ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఒకే ఫ్రేమ్‌లో 'వ‌రుడు కావ‌లెను' ఫ్యామిలీ

'వ‌రుడు కావాలి' అంటున్న రీతూవ‌ర్మ‌..ఫ‌స్ట్ గ్లింప్స్ వీడియో

మంచులో వ‌ణుకుతూ 'న‌దిలా న‌దిలా' మేకింగ్ వీడియో

ఆర్ఆర్ఆర్ లో సముద్ర‌ఖనికి ఛాన్స్ ఎలా వ‌చ్చిందంటే..?

బాలీవుడ్ సినిమాపై రామ్ క్లారిటీ..!

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo