శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 11:21:28

చేతికి బేడీల‌తో క‌నిపించిన వ‌ర్మ‌

చేతికి బేడీల‌తో క‌నిపించిన వ‌ర్మ‌

లాక్‌డౌన్ స‌మ‌యంలోను వ‌రుస సినిమాలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన వివాదాస్పద‌ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. రాజకీయం, శృంగారం, ఫ్యాక్ష‌న్ వంటి చిత్రాల‌పై ఆయ‌న‌ ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. తాజాగా 'ఆర్జీవీ మిస్సింగ్' రూపంలో ఓ వైవిధ్య‌మైన చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేందుకు సిద్ధ‌మయ్యారు. ప్రపంచంలోనే మొదటిసారిగా ఫిక్షనల్ రియాలిటీ(FR) జోన‌ర్‌లో ఈ సినిమా రూపొందుతుంద‌ని ప్ర‌క‌టించారు వ‌ర్మ‌

తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా, ఇందులో వ‌ర్మ బేడీల‌తో క‌నిపించారు. పోస్ట‌ర్‌పై అమాయ‌క బాధితుడు అని, త‌న‌ని   కిడ్నాప్ చేసార‌ని ఉంది. ఇందులో అనుమానితులుగా పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అని పేర్కొన్నాడు. ఇక‌ అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు సెకండ్ లుక్ పోస్టర్‌‌తో పీకేను పరిచయం చేస్తానని ప్రకటించారు. రామ్ గోపాల్ వర్మ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చటర్జీ నిర్మిస్తుండగా అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.