మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 15:26:49

డిగ్రీ ప‌ట్టా కోసం అర్హ‌త ప‌రీక్ష రాసిన న‌టి హేమ‌

డిగ్రీ ప‌ట్టా కోసం అర్హ‌త ప‌రీక్ష రాసిన న‌టి హేమ‌

ఎన్నో తెలుగు చిత్రాల‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ పోషించిన సినీ న‌టి హేమ న‌ల్ల‌గొండ జిల్లాలోని ఎన్జీ క‌ళాశాల‌లో డిగ్రీ అర్హ‌త ప‌రీక్ష రాసి అంద‌రిని ఆశ్చ‌ర్య ప‌ర‌చారు. డిగ్రీ పట్టా పొందేందుకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకున్న ఆమె ఈ రోజు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. ప‌రీక్ష పూర్తైన త‌ర్వాత మీడియాతో మాట్లాడిన హేమ .. డిగ్రీ చేయాల‌ని ఎప్ప‌టి నుండో అనుకుంటున్నాను. హైద‌రాబాద్‌లో అయితే ఇబ్బంది అవుతుంద‌ని న‌ల్ల‌గొండ‌కు వ‌చ్చిన ప‌రీక్ష రాస్తున్న‌ట్టు పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో జ‌రుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటూనే ఖాళీ స‌మ‌యంలో ప‌రీక్ష కోసం ప్రిపేర్ అయింది. హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయ‌ని భావించిన హేమ న‌ల్గొండ‌లో ఉన్న త‌న బంధువుల ఇంట్లో ఉంటూ ప‌రీక్ష రాస్తుంది. ఈ విష‌యం తెలుసుకున్న హేమ అభిమానులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.


logo