శుక్రవారం 03 జూలై 2020
Cinema - Jul 01, 2020 , 10:16:33

రాజ‌కీయాలొద్దు.. శేఖ‌ర్ సుమన్‌, సందీప్ సింగ్‌పై సుశాంత్ ఫ్యామిలీ ఆగ్ర‌హం

రాజ‌కీయాలొద్దు.. శేఖ‌ర్ సుమన్‌, సందీప్ సింగ్‌పై సుశాంత్ ఫ్యామిలీ ఆగ్ర‌హం

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై .. టీవీ స్టార్ శేఖ‌ర్ సుమ‌న్ రాజ‌కీయాలు చేస్తున్న‌ట్లు హీరో కుటుంబ‌స‌భ్యులు ఆరోపించారు.  జూన్ 14వ తేదీన ముంబైలోని త‌న నివాసంలో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే రెండు రోజుల క్రితం సుశాంత ఫ్యామిలీని శేఖ‌ర్ సుమన్ క‌లిశాడు. ఆ త‌ర్వాత అత‌ను మీడియాతో మాట్లాడుతూ సుశాంత్ మ‌ర‌ణంపై అనుమానాలు వ్య‌క్తం చేశాడు. ఆ వెంట‌నే అత‌ను వెళ్లి ఆర్జేడీ పార్టీలో చేరాడు. దీన్ని సుశాంత్ కుటుంబ‌స‌భ్యులు వ్య‌తిరేకిస్తున్నారు.  ఆర్జేడీ చీఫ్ తేజ‌స్వి యాద‌వ్ నిర్వ‌హించిన మీడియా స‌మావేశం బ్యాన‌ర్‌తోనే శేఖ‌ర్ సుమన్.. హీరో మ‌ర‌ణంపై ప్ర‌శ్న‌లు వేశారు.  సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టా‌ల‌న్నారు.  

ఆర్జేడీ చీఫ్ తేజ‌స్వి, శేఖ‌ర్ సుమ‌న్ చేసిన డిమాండ్ల‌ను సుశాంత్ కుటుంబ‌సభ్యుల‌ను కొట్టిపారేశారు.  పొలిటిక‌ల్ బ్యాన‌ర్‌తో మాట్లాడ‌డం అంటే రాజ‌కీయ ల‌బ్ధి కోస‌మే అని, సుశాంత్ మ‌ర‌ణంపై ఇప్ప‌టికే పోలీసులు విచార‌ణ మొద‌లుపెట్టార‌ని, దీంట్లో రాజ‌కీయ జోక్యం అవ‌స‌రం లేద‌ని సుశాంత్ కుటుంబ‌స‌భ్యులు తెలిపారు.  

సుశాంత్ స్నేహితుడు సందీప్ సింగ్ ప‌ట్ల కూడా హీరో కుటుంబ‌స‌భ్యులు అసంతృప్తితో ఉన్నారు.  సుశాంత్ మ‌ర‌ణం వెనుక ఎటువంటి అనుమానం లేద‌ని హీరో చ‌నిపోయిన వెంట‌నే సందీప్ కామెంట్ చేశాడు. కానీ ఇప్పుడు తేజ‌స్వి, శేఖ‌ర్ సుమ‌న్‌తో క‌లిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన‌డం ప‌ట్ల సుశాంత్ కుటుంబ‌స‌భ్యులు ఆగ్రహంగా ఉన్నారు. బాలీవుడ్‌లో గ్యాంగిజ‌మ్ ఉంద‌ని, స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే సుశాంత్ 50 సిమ్‌కార్డులు మార్చిన‌ట్లు శేఖ‌ర్ ఆరోపించాడు.  సుశాంత్ మ‌ర‌ణం వెనుక మిస్ట‌రీ లేద‌న్న సందీప్ ఎలా మీడియా ముంద‌కు వెళ్లాడ‌న‌ని ప్ర‌శ్నించారు. 


logo