శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 27, 2020 , 15:49:00

కైరా స్టైలిష్ డ్యాన్స్..హీలీ టూట్ గ‌యీ వీడియో సాంగ్‌

కైరా స్టైలిష్ డ్యాన్స్..హీలీ టూట్ గ‌యీ వీడియో సాంగ్‌

బాలీవుడ్ భామ కైరా అద్వానీ న‌టిస్తోన్న చిత్రం ఇందూ కీ జ‌వాని. ఆదిత్యా సీల్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి హీలీ టూట్ గ‌యీ వీడియో సాంగ్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పాట‌లో కైరా షార్ట్ డ్రెస్ , గోల్డెన్ శారీల్లో స్టైలిష్ స్టెప్పులేస్తూ అద‌ర‌గొట్టింది. ఈ పాట‌ను చూస్తుంటే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ గ్యారంటీ అని తెలిసిపోతుంది. బాద్ షా రాసి మ్యూజిక్ అందించిన ఈ పాట‌ను బాద్ షా, ఆస్తాగిల్ పాడారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి హ‌సీనా పాగ‌ల్ దివాని వీడియో సాంగ్ విడుద‌ల‌వ‌గా..కైరా ఆదిత్య‌సీల్ తో క‌లిసి అదిరిపోయే స్టెప్పులేసింది.

ఇందూ కీ జ‌వానీ నుంచి రిలీజైన రెండు పాట‌లు ఆడియెన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నాయి.  ఫీమేల్ ఓరియెంటెడ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న  ఇందూ కీ జ‌వానీ చిత్రాన్ని అభిర్ సేన్‌గుప్తా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.