శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 04, 2020 , 13:42:17

స్వ‌ర్గం దిగిన‌ట్టుగా ఉంది..ఫొటో షేర్ చేసిన నాగ్‌

స్వ‌ర్గం దిగిన‌ట్టుగా ఉంది..ఫొటో షేర్ చేసిన నాగ్‌

టాలీవుడ్ యాక్ట‌ర్ అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న మూవీ వైల్డ్ డాగ్‌. అహిషోర్ సాల్మ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రం ఇటీవ‌లే హిమాల‌య‌న్ ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంది. షూట్ కు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్ప‌‌టిక‌పుడు అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్నాడు నాగ్‌. రోహ్ తంగ్ పాస్ నుంచి ఓ వీడియో పోస్ట్ చేయ‌డంతోపాటు హిమాల‌యాల్లో వైల్డ్ డాగ్ టీం లొకేష‌న్ ఫొటోల‌ను షేర్ చేశాడు. తాజాగా మ‌రో అంద‌మైన స్టిల్ ను నాగార్జున ట్విట‌ర్ లో షేర్ చేశాడు.

సూర్యుడు భూమిపైకి దిగుతున్నాడా అన్న‌ట్టుగా హిమాల‌యాల్లోని లొకేష‌న్ లో సూర్య‌కిర‌ణాలు ప‌డుతున్న ఫొటోను నాగార్జున షేర్ చేశాడు.   స్వ‌ర్గం కిందికి దిగిన‌ట్టుగా హిమాల‌యాల్లో సూర్యాస్త‌మం..ఫొటోకు క్యాప్ష‌న్ ఇచ్చాడు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. వైల్డ్ డాగ్‌, మ‌నాలీ హ్యాష్ ట్యాగ్ ల‌ను జోడించాడు. ఈ చిత్రంలో నాగార్జునతోపాటు స‌యామీ ఖేర్, అలీ రెజా, మ‌యాంక్ ప్ర‌కాశ్ ప‌లువురు నటీన‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo