గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 09:26:08

ఘాటు ఘాటుగా నామినేషన్ ప్ర‌క్రియ‌..లిస్ట్‌లో 9 కంటెస్టెంట్స్

ఘాటు ఘాటుగా నామినేషన్ ప్ర‌క్రియ‌..లిస్ట్‌లో 9 కంటెస్టెంట్స్

సోమవారం వ‌స్తే ఇంటి స‌భ్యుల‌తో పాటు ప్రేక్ష‌కుల‌లో గుండెల్లో గుబులు రేగుతుంది. ఆ రోజు నామినేష‌న్  ప్ర‌క్రియ ఉండ‌నుండ‌గా, హౌజ్‌మేట్స్ త‌మ‌కు న‌చ్చ‌ని వారిని నామినేట్ చేస్తూ వాద‌న‌ల‌కు దిగుతుంటారు. ఈ నేప‌థ్యంలో బిగ్ బాస్ హౌజ్ హీటెక్కిపోతుంది. ఆరో వారం జ‌రిగిన నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో నామినేట్‌ చేయాలనుకునే ఇద్ద‌రు వ్యక్తుల‌ మెడలో ఎండు మిర్చిల దండ వేసి.. అనంతరం కారణం చెప్పాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ ఆదేశించారు.

ముందుగా అరియానా రంగంలోకి దిగ‌గా తాను  మెహబూబ్, మోనాల్ ల‌ని నామినేట్ చేసింది. ఇక  దివి - నోయల్, మెహబూబ్..  నోయల్ - దివి, అభిజిత్.. హారిక - అరియానా, కుమార్ సాయి..  అభిజిత్ - మెహబూబ్, అఖిల్..  లాస్య - మెహబూబ్, దివి..  మెహబూబ్ - దివి, అరియానా..  సొహైల్ - అరియానా, కుమార్ సాయి ..  రాజ శేఖర్ మాస్టర్ - లాస్య, అభిజిత్...  అవినాష్ - దివి, అభిజిత్, మోనాల్ - అరియానా, దివి ..  అఖిల్ - అభిజిత్, అరియానా ..  కుమార్ సాయి - హారిక, సొహైల్ ల‌ను నామినేట్ చేశారు.

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఎప్ప‌టిలాగానే అభిజిత్‌ను అఖిల్ నామినేట్ చేయ‌గా, అఖిల్‌ను అభిజిత్ నామినేట్ చేశాడు. గ‌త వారం నామినేష‌న్ అప్పుడు మోనాల్ పేరును తీయ‌డం నాకు న‌చ్చ‌ని కారణంగానే నామినేట్ చేశాన‌ని అబిజిత్ చెప్ప‌గా, అఖిల్ కెప్టెన్ టాస్క్ స‌మ‌యంలో సంచాల‌కుడిగా ఫెయిల్ అయ్యావంటూ నామినేట్ చేశాడు. ఇక హారిక ఎప్ప‌టిలాగానే కుమార్ సాయిని చెత్త రీజ‌న్‌తో నామినేట్ చేసింది. అయితే ఈ వారం నామినేష‌న్ స‌మ‌యంలో పెద్ద‌గా హాట్ హాట్ డిస్క‌ష‌న్స్ ఏమి న‌డ‌వ‌లేదు కాని కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది.

నామినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌య్యాక బిగ్ బాస్ ప్ర‌త్యేక అధికారం ఉన్న సోహైల్‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. మీరు నామినేష‌న్‌లో ఉన్న ఒక‌రిని సేవ్ చేయోచ్చ‌ని పేర్కొన్నాడు. దీంతో మొద‌టి నుండి త‌న‌కు స‌పోర్ట్‌గా ఉంటున్న మెహ‌బూబ్‌ని సేవ్ చేశాడు సోహైల్. దీంతో ఈ వారం నామినేష‌న్‌లో  అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు ఉన్నారు. ఇందులో ఒక‌రు లేదా ఇద్ద‌రు వ‌చ్చే వారం బిగ్ బాస్ హౌజ్‌ను వీడ‌నున్నారు. 


logo