శనివారం 06 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 17:12:52

ఆలోచించండి అన్న‌లారా.. ఆవేశం మానుకోండి త‌మ్ములారా

ఆలోచించండి అన్న‌లారా.. ఆవేశం మానుకోండి త‌మ్ములారా

త‌మ కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని మ‌ర‌చి  ప్ర‌జ‌ల‌కి ర‌క్ష‌ణ‌గా ఉంటున్న పోలీసులు, వైద్యుల‌పై దాడులు చేయ‌డాన్ని ప్ర‌తి ఒక్క‌రు ఖండిస్తున్నారు . విచ‌క్ష‌ణ కోల్పోయి క్రూరంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌వారిలో చైత‌న్యం క‌లిగించేందుకు సెల‌బ్రిటీలు, ర‌చ‌యిత‌లు, క‌ళాకారులు త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఆ మ‌ధ్య పోలీసుల త్యాగం గురించి కీర‌వాణి, కోటి, ర‌ఘు కుంచె, ఇలా పలువురు సాంగ్స్ రూపొందించారు.

తాజాగా ప్ర‌ముఖ ర‌చ‌యిత చంద్ర‌బోస్ ..ఆలోచించండి అన్న‌లారా.. ఆవేశం మానుకోండి త‌మ్ములారా అంటూ ఓ పాట రాసి ఆల‌పించారు. కోవిడ్ 19కి వ్య‌తిరేఖంగా పోరాడుతున్న వారి కోసం చంద్ర‌బోస్ రాసిన ఈ హార్ట్ ట‌చింగ్ సాంగ్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మీరు ఓ సారి వినండి


logo