గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 19, 2021 , 17:17:56

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

సాధార‌ణంగా తెలుగు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు త‌మ సినిమాలను స‌క్సెస్ బాట‌లో న‌డిపించే యాక్ట‌ర్ల‌వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు. సినిమాలో హీరోకు స‌మాన ప్రాధాన్యం ఉండే పాత్ర విల‌న్‌. సినిమాను ర‌క్తిక‌ట్టించాలంటే బ‌ల‌మైన ప్ర‌తినాయకుడుంటేనే సాధ్యమ‌వుతుంది. తెలుగు సినిమాల్లో విల‌న్ గా విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ చాలా కాలం త‌న హ‌వాను న‌డిపించాడు. మ‌రోవైపు జ‌గ‌ప‌తిబాబు కూడా విల‌న్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టి తానెంటో నిరూపించుకున్నాడు.

మ‌రో ప్ర‌తినాయ‌కుడు రావు రమేశ్‌. అల‌నాటి స్టార్ విల‌న్ రావు గోపాల‌రావు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై విల‌నిజంలో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వారికి నేనేం త‌క్కువ కాదంటూ కొన్నాళ్లుగా మ‌రో కొత్త విల‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను తెగ‌ ఎంట‌ర్ టైన్ చేస్తున్నాడు. ఇంత‌కీ ఆ న‌టుడెవ‌ర‌నుకుంటున్నారా..? 2020లో సంక్రాంతికి అల‌..వైకుంఠ‌పురం చిత్రంతో మంచి హిట్టును ఖాతాలో వేసుకున్నాడు స‌ముద్ర‌ఖ‌ని. ఈ ఏడాది కూడా ర‌వితేజ న‌టించిన క్రాక్ చిత్రంతో విల‌న్‌గా మ‌రోసారి తానెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.

స‌ముద్ర‌ఖ‌ని ఇపుడు టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు మోస్ట్ వాంటెడ్ యాక్ట‌ర్ అయిపోయాడు. ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ లో కీ రోల్ పోషిస్తున్నాడు స‌ముద్ర‌ఖ‌ని. ఇపుడు సముద్ర‌ఖ‌నికి విల‌న్ గా మంచి డిమాండ్ ఏర్ప‌డింద‌ని ప‌లువురు సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

సంక్రాంతి హిట్‌పై క‌న్నేసిన సోనూసూద్‌..?

'క్రాక్' చూసి ఒంగోలు మెమొరీస్ గుర్తుచేసుకున్న చిరంజీవి

‘క్రాక్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్

లైట్‌..కెమెరా..యాక్ష‌న్..'ఖిలాడి' సెట్స్ లో ర‌వితేజ‌

డెడ్ లైన్’ పెట్టుకున్న హీరోలు ?

తెర‌పైకి నాగార్జున-పూరీ కాంబినేష‌న్‌..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo