హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం 8,760 కోట్లు

ముంబై, జనవరి 16: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ బ్యాంక్ రూ.8,760 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఆర్జించిన లాభం కంటే ఇది 14.36 శాతం అధికం. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.36,0 39 కోట్ల నుంచి రూ.37,522 కోట్లకు ఎగబాకింది. బ్యాంక్ నూతన సీఈవో, ఎండీ శశిధర్ జగదీషన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలైన తొలి ఆర్థిక ఫలితాలు ఇవే కావడం విశేషం. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.42 శాతం నుంచి 0.81 శాతానికి దిగొచ్చింది. నికర వడ్డీ ఆదాయం ద్వారా రూ.16,317 కోట్లు సమకూరడంతో లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని తెలిపింది. వడ్డీయేతర ఆదాయం ఏడాది ప్రాతిపదికన 11 శాతం పెరిగి రూ.7443 కోట్లు వచ్చాయని బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. కరోనా వైరస్ కారణంగా గత త్రైమాసికంలో మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ. 8,656 కోట్ల నిధులను కేటాయించింది. మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంకునకు అనుబంధంగా పనిచేస్తున్న హెచ్డీబీ ఫైనాన్సియల్ సర్వీసుల ఆస్తుల విలువ రూ.56 వేల కోట్ల నుంచి 57,710 కోట్లకు చేరుకున్నాయి.
తాజావార్తలు
- విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇస్తున్న స్టార్ డైరెక్టర్..?
- వాలంటీర్లు మున్సిపల్ అధికారులకు సెల్ఫోన్లు అప్పగించాలి
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- పెట్రోల్ మంట: భారత విజ్ఞప్తిని పట్టించుకోని సౌదీ అరేబియా
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్