‘ఉన్నతవిద్యావంతుడు అనే ట్యాగ్‌ను నేను ప్లస్గానే భావిస్తా. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు లాజిక్స్‌ను మేళవిస్తూ కథలు చెప్పడానికి ఈ ట్యాగ్ ఉపయోగపడుతుంది’ అని అన్నారు హసిత్ గోలి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రాజరాజచోర’. శ్రీవిష్ణు హీరోగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో హసిత్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ దర్శకుడు వివేక్ ఆత్రేయ నాకు మంచి స్నేహితుడు. లఘు చిత్రాలతో మా ఇద్దరి స్నేహం మొదలైంది. వివేక్ దర్శకత్వంలో రూపొందిన ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలకు దర్శకత్వవిభాగంలో పనిచేశా. బిట్స్ పిలానీలో చదువుకున్నా. ప్రముఖ ఆన్లైన్మార్కెటింగ్ సంస్థలో చాలా కాలం పాటు పనిచేశా. సినిమాలపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదులుకున్నా. నేను కథ చెప్పే విధానం నచ్చి శ్రీవిష్ణు ఈ అవకాశమిచ్చారు. ఓ కొంటె దొంగ కథ ఇది. గ్రేషేడ్స్తో శ్రీవిష్ణు పాత్ర వినూత్నంగా సాగుతుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటుంది.శ్రీవిష్ణులోని కామెడీ టైమింగ్‌ను పూర్తిస్థాయిలో ఆవిష్కరించే సినిమా ఇది. ఓటీటీలో అవకాశాలు వచ్చినా థియేటర్స్‌లోనే విడుదలచేయాలని నిర్మాతలు బలంగా నిర్ణయించుకున్నారు’ అని తెలిపారు.