మంగళవారం 26 మే 2020
Cinema - May 15, 2020 , 16:55:50

హ‌రీష్ వ‌ర్సెస్ బండ్ల గ‌ణేష్‌.. ముదురుతున్న ర‌చ్చ‌

హ‌రీష్ వ‌ర్సెస్ బండ్ల గ‌ణేష్‌.. ముదురుతున్న ర‌చ్చ‌

హ‌రీష్ శంక‌ర్, బండ్ల గ‌ణేష్ మ‌ధ్య మొద‌లైన గ‌బ్బ‌ర్ సింగ్ ర‌చ్చ రోజురోజుకి ముదురుతుంది. ఒక‌రికి ఒక‌రు మేం లైఫ్ ఇచ్చామంటే మేం లైఫ్ ఇచ్చాం అంటూ వాగ్వాదాల‌కి దిగుతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రుగుతున్న ఈ కూల్ వారికి ఎవ‌రు అడ్డుక‌ట్ట వేస్తారా అని అంద‌రు ఆస‌క్తిగా చూస్తున్నారు.

వివ‌రాలలోకి వెళితే మే 12,2012న విడుద‌లైన గ‌బ్బర్ సింగ్ చిత్రం ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ .. బండ్ల గణేష్ మినహా.. ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే త‌న‌ను కావాల‌నే  ఇగ్నోర్ చేసిన‌ట్టు భావించిన బండ్ల గ‌ణేష్ ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు విసిరారు ‘అదీ ఆయ‌న‌ సంస్కారం..  పవన్ కళ్యాణ్‌కి పరిచయం చేసి సినిమా అవకాశం ఇప్పించింది నేను.. ఎన్టీఆర్‌తో సినిమా మిస్ అయ్యి డిప్రెషన్‌లో ఉంటే.. నేను పిలిచి సినిమా ఇచ్చా.. ఆయన గబ్బర్ సింగ్ లాంటి హిట్ వచ్చిందంటే ఎవరివల్లో మరిచిపోయారు హ‌రీష్ అని బండ్ల అన్నారు.

అంతేకాక హ‌రీష్  సంస్కారం గురించి ఇంతకంటే ఏం మాట్లాడగలం. అయినా హరీష్ శంకర్ రీమేక్ దర్శకుడు. ఆయన రీమేక్ చిత్రాలు తప్ప సొంతంగా స్ట్రయిట్ సినిమా తీయలేరు. ఆయన్ని స్ట్రయిట్ సినిమా తీసి హిట్ కొడితే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళిపోతా. గబ్బర్ సింగ్ కూడా అంత పెద్ద హిట్ అయ్యిందంటే అందులో పవన్ కళ్యాణ్ సలహాలు చాలా ఉన్నాయి. అంత్యాక్షరి ఎపిసోడ్ పవన్ ఐడియానే. హీరోయిన్ శృతి హాసన్ ఎంపిక కూడా పవన్ కళ్యాణ్‌దే. సినిమా టైంలో మా మ‌ధ్య విభేదాలు ఏం లేవు. ఉండి ఉంటే సినిమా పూర్త‌య్యేది కాదు. ఆయ‌న గురించి అన్న ప్ర‌తి మాట‌కి క‌ట్టుబ‌డి ఉన్నా అంటూ బండ్ల గ‌ణేష్ ఫైర్ అయ్యాడు.

తింటున్నంత సేపు విస్త‌రాకు అంటారు, తిన్నాక ఎంగిలాకు అంటారు. నీతో అవ‌స‌రం  ఉన్నంత సేపు వరుస‌లు క‌లుపుతారు. అవి తీరాక మాట‌లు అంట‌క‌డతారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు బండ్ల‌. అయితే బండ్ల గ‌ణేష్ మాట‌ల‌కి హ‌రీష్ కూడా కౌంట‌ర్ ఎటాక్ ఇచ్చ‌న‌ట్టు స‌మాచారం. ఎవ‌రు ఎవ‌రికి లైఫ్ ఇచ్చారో అంద‌రికి తెలుసు. ఎవ‌రి సినిమా ముందు రిలీజ్ అయిందో కూడా తెలుసు అని హ‌రీష్ మాట్లాడిన‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఈ కూల్ వార్‌కి ముగింపు ఎలా వ‌స్తుందో చూడాలి.


logo