శనివారం 06 జూన్ 2020
Cinema - May 23, 2020 , 15:32:29

మిమిక్రీ ఆర్టిస్ట్ హ‌రికిష‌న్ క‌న్నుమూత‌

మిమిక్రీ ఆర్టిస్ట్ హ‌రికిష‌న్ క‌న్నుమూత‌

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరి కిషన్ (57) కన్నుమూసారు. పాత త‌రం హీరోలు ఎన్టీఆర్, కృష్ణ‌, శోభన్ బాబు, చిరు, నాగార్జున, బాల‌య్య‌ల‌తో పాటు ఈ త‌రం హీరోలు ప‌వ‌న్ , మ‌హేష్ ఇలా ప‌లువురు హీరోల గొంతుల‌ని ఎంతో అద్భుతంగా అనుక‌రిస్తూ వ‌చ్చారు. రాజ‌కీయ నాయ‌కుల గొంతుల‌ని కూడా అనుక‌రించ‌డంలో ఆయ‌న దిట్ట అని చెప్ప‌వ‌చ్చు.

హరికిషన్.. మే 30, 1963న ఏలూరులో జ‌న్మించారు. 8 ఏళ్ల వయసులోనే తన గురువులను తోటి వాళ్ల గొంతులను మిమిక్రీ చేయడాన్ని ప్రారంభించారు హరికిషన్.  ఆయ‌న మిమిక్రీకి ఎంతో మంది ముగ్ధులు కాగా, సెల‌బ్రిటీలు కూడా త‌న టాలెంట్‌కి ఫిదా అయ్యారు. హరికిష‌న్  కేవలం మిమిక్రీ మాత్రమే కాక‌ పశు పక్ష్యాదుల శబ్ధాలతో పాటు యంత్రాలు చేసే శబ్ధాలు.. సంగీత వాద్య పరికరాల సౌండ్స్‌ను తన గొంతులో ప‌లికించారు. దేశ విదేశాల‌లో ఎన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన హ‌రికిష‌న్  ప్రముఖ నటుడు శివారెడ్డికి   గురువు కూడా.  మిమిక్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం లిఖించుకున్న హ‌రికిష‌న్ మృతి తెలుగు వారికి తీర‌ని విషాదాన్ని మిగిల్చింది.  రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు ఆయ‌న మృతికి సంతాపం తెలియ‌జేస్తున్నారు logo