సోమవారం 25 జనవరి 2021
Cinema - Nov 21, 2020 , 07:50:53

అఖిల్‌కు హ్యాండ్‌... హారిక‌ని కెప్టెన్ చేసిన మోనాల్

అఖిల్‌కు హ్యాండ్‌... హారిక‌ని కెప్టెన్ చేసిన మోనాల్

బిగ్ బాస్ సీజ‌న్ 4లో ఈ వారం ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ కోసం బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు క్విజ్ పెట్టాడు. ప‌ది వారాలు ఇంట్లో ఉన్న వారు  బిగ్ బాస్ హౌజ్‌ని ఎంత గ‌మనించార‌నే కోణంలో ఈ క్విజ్ జ‌రిగింది. క్విజ్ మాస్ట‌ర్‌గా అవినాష్ ఉండ‌గా, పోటీ దారులుగా సోహైల్‌, లాస్య, మోనాల్‌, అభిజిత్ ఉన్నారు. వీరు ఆన్స‌ర్ చెప్ప‌గానే అందుకు సంబంధించి కొంత ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ ఇచ్చారు బిగ్ బాస్ 

ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో అభిజీత్, అఖిల్, హారిక‌లు పాల్గొన‌గా వీరు ముగ్గురు మిగ‌తా ఇంటి స‌భ్యుల‌ని ఒప్పించి వారి భుజాల‌పై కూర్చోవాలి. ఎవ‌రు అయితే చివ‌రి వ‌ర‌కు భుజాల‌పై ఉంటారో వారు విజేత‌లుగా నిలుస్తార‌ని బిగ్ బాస్ అన్నారు. అభిజిత్‌ని అవినాష్ త‌న భుజాల‌పై ఎక్కించుకోగా, సోహైల్ భుజాల‌పై అఖిల్, మోనాల్ భుజాల‌పై హారిక కూర్చున్నారు. అవినాష్ తొంద‌ర‌గానే అభిజిత్ ని దించేయ‌గా, సోహైల్ కూడా ఎక్కువ సేపు ఉండ‌లేక‌పోయాడు. చివ‌రి వ‌ర‌కు హారిక‌.. మోనాల్ భుజాల‌పై ఉండ‌డంతో హారిక‌ని వ‌చ్చే వారం ఇంటి కెప్టెన్‌గా ఎంపికైంది .అయితే కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయిన అఖిల్ చాలా బాధ‌ప‌డ్డాడు. మోనాల్ హ్యాండ్ ఇచ్చింద‌ని దిగులు చెందాడు

ఎనిమిది సార్లు కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ ప‌డిన హారిక చివ‌ర‌కు మోనాల్ ద‌య వ‌ల‌న కెప్టెన్సీ బ్యాండ్ అందుకుంది. అమ్మ మొన్న కెప్టెన్ ఎప్పుడు అయితావు అన్నావు కాదా అయ్యాను అమ్మా అంటూ చిందులేసింది హారిక‌.  నోయల్‌ టీషర్‌ వేసుకొని ఈ టాస్క్‌ ఆడానంటూ చెప్పుకొచ్చింది. కాని అబ్బాయిల వ‌ల‌న కూడా సాధ్యం కాని ఈ టాస్క్‌ని మోనాల్ ఇంత ఈజీగా పూర్తి చేయ‌డంతో అంద‌రు అవాక్క‌వుతున్నారు


logo