మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 06, 2020 , 08:48:41

బిగ్ బాస్ హౌజ్‌లో హ‌త్య‌లు.. హారికపై అనుమానం

బిగ్ బాస్ హౌజ్‌లో హ‌త్య‌లు.. హారికపై అనుమానం

కెప్టెన్ పోటీ దారుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన  ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో అనే టాస్క్ గురువారం ముగిసింది. ఈ టాస్క్‌లో బిగ్ బాస్ హౌజ్‌ని ప‌ల్లెటూరిగా మార్చి ఇంటి స‌భ్యుల‌తో డ్రామా చేయించారు. 61వ ఎపిసోడ్ కూడా పూర్తి బోరింగ్‌గా సాగింది. ఫుడ్ విష‌యంలో అభిజిత్‌- అరియానాల మ‌ధ్య కాసేపు వాగ్వాదం జ‌రిగింది. ఫుడ్ విష‌యంలో టాస్క్ ఆపేస్తావు అని అరియానా మండిప‌డ‌డంతో అందుకు ధీటుగా అభిజిత్ స్పందించారు.

అరియానా ఆక‌లి బాధ చూడ‌లేక ఫుడ్ తీసుకొస్తాన‌ని మాస్ట‌ర్ హౌజ్ లోపలికి రాగా, ఈయ‌న చెప్పిన డీల్‌కు అభి టీం సాటిస్ఫై కాలేదు. ఫుడ్ ఇవ్వ‌డం క‌ష్ట‌మని చెప్ప‌డంతో మోనాల్ చేతిలో ఉన్న ప్లేట్‌ని నెట్టేసి బ‌య‌ట‌కు వెళ్ళిపోయాడు అమ్మ రాజ‌శేఖ‌ర్. ఇక సీక్రెట్ టాస్క్‌లో భాగంగా అవినాష్‌ని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేసింది. అఖిల్ కూడా మ‌ధ్య‌లో ఇన్వాల్వ్ కావ‌డంతో గొడ‌వ పెద్ద‌దైంది. ఆవేశంతో పాన్ డ‌బ్బాను కింద ప‌డేసి ర‌చ్చ చేశాడు అవినాష్‌. దీంతో హౌజ్‌లో లో మ‌రో హ‌త్య జ‌రిగింద‌ని బిగ్ బాస్ ప్ర‌క‌టించారు.

ఇక సీక్రెట్ టాస్క్ లో చివ‌రిది గ్లాస్ పైన ఎవ‌రిని చంపాలనుకుంటున్నారో వారి పేరుని లిప్‌స్టిక్‌తో రాయాల్సి ఉండ‌డంతో దీనిని విజ‌యవంతంగా పూర్తి చేసింది హారిక. అయితే ఈ ప‌ని ఎవ‌రి చేశారనే దానిపై చాలా సేపు డిస్క‌ష‌న్ జ‌రిగింది. ఈ ప‌నులు చేసేది  అమ్మ రాజ‌శేఖ‌ర్ , అభిజీత్, హారిక‌ల‌లో ఒక‌రై  ఉంటార‌ని ఇంటి స‌భ్యులు అనుమానించారు. చివరికి హారిక‌పైనే అంద‌రికి అనుమానం పెరిగింది. ఆమెనే హ‌త్య చేసి ఉంటుంద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు.

హ‌త్య చేసింది సోహైల్ అని అనుమానించిన అవినాష్‌.. నోటికొచ్చిన మాట‌లు అన్నాడు. అయిన‌ప్ప‌టికీ సోహైల్ సైలెంట్‌గా ఉన్నాడు.ఇక చివ‌ర‌కు గ్రామ పెద్ద అయిన సోహైల్ పంచాయితీ పెట్టి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాడు. హారిక‌నే హ‌త్య‌లు చేస్తుంద‌ని తీర్మానించాడు. దీంతో ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో అనే టాస్క్ ముగిసిన‌ట్టు బిగ్ బాస్ తెలియ‌జేశారు.


logo