మంగళవారం 26 జనవరి 2021
Cinema - Oct 29, 2020 , 08:48:07

చాక్లెట్ దొంగిలించినందుకు హారిక‌పై అలిగిన మాస్టర్

చాక్లెట్ దొంగిలించినందుకు హారిక‌పై అలిగిన మాస్టర్

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్రమంలో మంగ‌ళవారం మొద‌లైన బీబీ డేకేర్అనే ల‌గ్జ‌రీ బడ్జెట్ టాస్క్ బుధ‌వారం కూడా కొన‌సాగింది. ఈ టాస్క్‌లో అమ్మ రాజ‌శేఖ‌ర్, అరియానా, అవినాష్‌, మెహ‌బూబ్‌లు చిన్న‌పిల్ల‌లా మారి కేర్ టేకర్స్‌ని తెగ విసిగించారు. హారిక‌.. మాస్ట‌ర్‌తో పాటు అరియానాని కూడా ఇబ్బంది పెట్టింది. పిల్ల‌ల్లా మారిన హౌజ్‌మేట్స్ డైప‌ర్స్ ధ‌రించి ఇల్లంతా తిరుగుతూ ర‌చ్చ ర‌చ్చ చేశారు. చిన్న‌పిల్ల‌ల మాదిరిగానే కొద్దిసేపు దాగుడు మూత‌ల ఆట ఆడాడు. ఆ త‌ర్వాత మాస్ట‌ర్ జేజులో దాచుకున్న చాక్లెట్‌ని హారిక దొంగిలించ‌డంతో అమ్మ అలిగాడు.

అయితే త‌న చాక్లెట్‌ను దొంగిలించిన హారిక ద‌గ్గ‌ర రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ తీసుకునే ప్ర‌య‌త్నంలో ఆమెను  ప‌ట్టుకొని కింద ప‌డేసి చెడ్డీలో చేయి పెట్టి తీయ‌బోయాడు. దీంతో అంద‌రు అమ్మాయితో అలా చేయోద్దు అనే స‌రికి అక్క‌డి నుండి సీరియ‌స్ గా జారుకున్నాడు. త‌న‌కి కేర్ టేక‌ర్‌గా ఉన్న అభిజిత్‌తో త‌న బాధ చెప్పుకున్నాడు. గేమ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు ఏంటి?  నా పాకెట్‌లో చేయి పెట్టుకొని తీసుకున్న‌ప్పుడు లేని రూల్స్ , ఆమె వ‌ర‌కు వ‌స్తే ఎందుకు గుర్తొస్తున్నాయి అంటూ అరిచాడు. 

ఇదే విష‌యంపై అభిజిత్‌, నోయ‌ల్‌, లాస్య చ‌ర్చిస్తూ మాస్ట‌ర్ చాక్లెట్ తీసుకునేందుకు హారిక మెడ‌లు ప‌ట్టుకున్నాడు అని అభిజిత్ అన్నాడు. ఇది క‌రెక్టో కాదో నాకు తెలియ‌దు అంటూ త‌ప్పించుకున్నాడు.ఇక‌ హారిక‌తో ఈ చాక్లెట్ విష‌యం డిస్క‌స్ చేస్తుండ‌గా, అభిజిత్ మాట్లాడుతూ..పాకెట్‌లో నుంచి తీసుకోవ‌డం లాక్కోవ‌డ‌మా, లేక దొంగ‌త‌న‌మా అని అన్నాడు. దీనికి హారిక అది దొంగ‌త‌న‌మే అని చెప్పింది. ఈ విష‌యం అప్పుడే అడిగితే బాగుండేది క‌దా అని హారిక అంటే దానికి అభిజిత్ నువ్వు ఎప్పుడు మాట్లాడాలో నాకు చెప్పాల్సిన ప‌నిలేదు. నేనేమ‌న్నా బేకార్ గాడిలా కనిపిస్తున్నానా, నీతో కూసొని మాట్లాడ‌డానికి అంటూ మండిప‌డ్డాడు. 

పనిలోప‌నిగా అంత‌క‌ముందు విష‌యం ప్ర‌స్తావ‌న తెచ్చిన అభిజ‌త్‌.. మాట్లాడుతున్న‌ప్పుడు అలా లేసి వెళ్లిపోవ‌డం క‌రెక్టా అని హారిక‌ని అడిగాడు.  దీంతో హారిక అత‌డికి క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ఇంకోసారి అలా చేయ‌నంటూ అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింది. అంతేకాదు రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్‌కు తిరిగి త‌ను తీసుకున్న చాక్లెట్ ఇచ్చేసింది. జాగ్ర‌త్త‌గా దాచుకోండి రేపు మ‌ళ్ళీ దొంగిలిస్తే నాకైతే సంబంధం లేదు అని హారిక చెప్పుకొచ్చింది. కాగా, హారిక జేబులో చేయి ప‌ట్టి దొంగిలించే విష‌యంలో మెహ‌బూబ్, అరియానాలు మాస్ట‌ర్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. గేమ్ గెల‌వ‌క‌పోయిన ప‌ర్వాలేదు కాని చెడ్డ‌వారు కావొద్దు అంటూ హిత‌వు ప‌లికారు. 


logo