శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 08:12:22

బిగ్ బాస్ ఎఫెక్ట్‌.. హారిక‌కు వ‌రుస ఆఫ‌ర్స్

బిగ్ బాస్ ఎఫెక్ట్‌.. హారిక‌కు వ‌రుస ఆఫ‌ర్స్

గ‌త మూడు సీజ‌న్స్‌తో పోల్చితే నాలుగో సీజ‌న్ కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ బాగా క‌లిసొచ్చింది. ఈ షో వ‌ల‌న ఇందులో పార్టిసిపేట్ చేసిన సోహెల్‌, మోనాల్, అఖిల్, అభిజీత్, అరియానా, లాస్య వంటి వారు మంచి ఆఫ‌ర్స్ పొందారు. తాజాగా దేత్త‌డి హారిక కూడా త‌న‌కు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు పేర్కొంది. ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ చేస్తున్న నేను ఓ సినిమాకు కూడా క‌మిట్ అయ్యాను. అలానే  దేత్త‌డి యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. 

బిగ్ బాస్ వ‌ల‌న  మెహ‌బూబ్, దివి వంటి కంటెస్టెంట్స్ కూడా బిజీ అయ్యారు. సోహెల్ సినిమాల‌తో బిజీగా ఉంటూ టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరిని క‌లుస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు. ఇక మోనాల్ స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ ప‌లు టీవీ షోల‌ను హోస్ట్ చేస్తుంది. అరియానాకు కూడా ఓ సినిమా ఆఫ‌ర్ ద‌క్కింది. అఖిల్ కూడా విల‌న్ పాత్ర‌కు సంబంధించిన ఆఫ‌ర్స్ ద‌క్కించుకున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైన బిగ్ బాస్ వ‌ల‌న కొంద‌రి కంటెస్టెంట్స్ జీవితానికి ఓ మార్గం ఏర్ప‌డింద‌నే చెప్పాలి. 

VIDEOS

logo