శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 10:41:15

హ‌రితేజకూ హ్యాకింగ్ క‌ష్టాలు త‌ప్ప‌లేదు..!

హ‌రితేజకూ హ్యాకింగ్ క‌ష్టాలు త‌ప్ప‌లేదు..!

ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. మంచి, చెడుల‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. అలానే విహార యాత్ర‌ల‌కు సంబంధించి‌న ఫొటోలు లేదంటే ఫ్యామిలీ వేడుక‌ల ఫొటోల‌తో పాటు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ని సామాజిక మాధ్య‌మాల ద్వారా పంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హ్యాకింగ్‌లు  సర్వసాధారణమయ్యాయి. ప‌ర్స‌న‌ల్ అకౌంట్స్ హ్యాక్ కావ‌డం వెంట‌నే తిరిగి త‌మ అధీనంలోకి తెచ్చుకోవ‌డం కామ‌న్‌గా మారింది.

రీసెంట్‌గా  లాస్య‌, మంచు లక్ష్మీ, మ‌నోజ్‌ల అకౌంట్స్ హ్యాక్ కాగా, ఈ విష‌యాన్ని స్వ‌యంగా తెలియ‌జేశారు. ఇక ఇప్పుడు న‌టి హ‌రితేజ అకౌంట్ కూడా హ్యాక్ అయింది. అయితే  హ్యాక్ అవ్వడం, రికవరీ జరిగిపోవడం వెంట‌వెంట‌నే జ‌రిగింది. ప్ర‌స్తుతం హ‌రితేజ గ‌ర్భ‌వ‌తి కాగా, ఇటీవ‌ల ఆమె శ్రీమంతం వేడుకుని కుటుంబ స‌భ్యులు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప‌లువురు  సీరియ‌ల్స్ న‌టులు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో హ‌రితేజ డ్యాన్స్ చేసి ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. 

VIDEOS

logo