శనివారం 06 జూన్ 2020
Cinema - May 01, 2020 , 15:19:21

నిజంగానే సిగ‌రెట్ తాగాను: బిగ్ బాస్ బ్యూటీ

నిజంగానే సిగ‌రెట్ తాగాను:  బిగ్ బాస్ బ్యూటీ

ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో సంద‌డి చేసిన బ్యూటీ హ‌రితేజ‌. హౌజ్‌లో ఉన్న‌న్నీ రోజులు తెగ సంద‌డి చేస్తూ తోటి కంటెస్టెంట్స్‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించింది. ఆమె చెప్పిన హ‌రిక‌థ సీజ‌న్ వ‌న్‌లోనే హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. బిగ్ బాస్ త‌ర్వాత హ‌రితేజ క్రేజ్ బాగా పెర‌గ‌డంతో న‌టిగా, యాంక‌ర్‌గా అడ‌పాద‌డ‌పా ప‌లు షోస్‌కి హోస్ట్‌గా అద‌ర‌గొడుతుంది.

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. తాజాగా ఓ నెటిజ‌న్ ఇన్‌స్టాగ్రాములో మాట్లాడుతూ.. అక్క హిట్ సినిమాలో మీరు నిజంగానే సిగ‌రెట్ తాగారా అన్ని ప్రశ్నించాడు. అందుకు ఆమె అవును, క్యారెక్ట‌ర్ డిమాండ్ చేసింది. త‌ప్ప‌లేదు అని పేర్కొంది. ఇక మ‌రో నెటిజ‌న్ ఏజ్ ఎంత అని అడ‌గ‌గా, ‘చెప్పిన నమ్మరు. నమ్మిన‌ వినరు. విన్నా అర్థం చేసుకోరు. నిజాలు నిష్టూరమే ఎప్పుడూ.. అయినా చెప్తా.. 24/02/1992’ అని చెప్పి అంద‌రికి షాక్ చెప్పింది. ఇక కొద్ది సేపు పాట‌లు, మాట‌లతో టైం పాస్ చేసిన హ‌రితేజ అంద‌రిని ఇళ్ళ‌ల్లోనే ఉండాల‌ని కోరింది.


logo