ఆదివారం 07 మార్చి 2021
Cinema - Dec 16, 2020 , 00:06:45

కౌన్‌ హై అచ్ఛ్చా

కౌన్‌ హై అచ్ఛ్చా

రామ్‌ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘రెడ్‌'. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్‌ తిరుమల దర్శకుడు. నివేదా పేతురాజ్‌, మాళవికాశర్మ, అమృతా అయ్యర్‌ కథానాయికలు. ఈ చిత్రంలోని ‘కౌన్‌ హై అచ్ఛా..’ అనే పాటను ఇటీవల చిత్రబృందం విడుదలచేసింది.  అనురాగ్‌ కులకర్ణి ఈ గీతాన్ని ఆలపించారు. కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యాన్ని అందించారు.  మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.  దర్శకుడు మాట్లాడుతూ ‘ఒకే పోలికలతో ఉండే భిన్న ధృవాల్లాంటి ఇద్దరు యువకుల కథ ఇది. యాక్షన్‌, ప్రేమ, మాస్‌ హంగులతో విభిన్నంగా ఉంటుంది. సినిమాలో  హీరో క్యారెక్టర్‌ ఎలివేషన్‌ కోసం సందర్భానుసారంగా వచ్చే ‘కౌన్‌ హై అచ్ఛా..’ పాటకు చక్కటి స్పందన లభిస్తోంది. మానవ నైజాన్ని పాటలో అద్భుతంగా వివరించారంటూ ప్రశంసిస్తున్నారు’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘రామ్‌ నుంచి అభిమానులు ఆశించే అన్ని హంగులున్న చిత్రమిది. అతడి కెరీర్‌లో మరో విలక్షణ సినిమాగా నిలుస్తుంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని అన్నారు. నాజర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌. 


VIDEOS

logo