భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఫ్రెండ్షిప్’. జాన్పాల్రాజ్, శ్యామ్సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఎ.ఎన్ బాలాజీ తెలుగులో విడుదలచేస్తున్నారు. లోస్లియా కథానాయిక. అర్జున్ కీలక పాత్రధారి. సెప్టెంబర్లో ఈ సినిమా విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాలని ప్రయత్నించే రాజకీయ నాయకుడికి ఓ యువకుడు ఎలా బుద్ధి చెప్పాడన్నది ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాం. సెన్సార్ను పూర్తిచేసి సెప్టెంబర్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని చెప్పారు.