సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 02:57:44

నిద్రలేని రాత్రులు గడిపా

నిద్రలేని రాత్రులు గడిపా

‘ఓ బేబీ’ సినిమాతో పాటు ‘ఫ్యామిలిమ్యాన్‌-2’ వెబ్‌సిరీస్‌ను తన సినీ ప్రయాణంలో ఎప్పటికీ మరచిపోలేనని చెప్పింది సమంత.  ఈ  రెండింటిలో చేసిన  పాత్రలు కెరీర్‌లో ఎక్కువ సంతృప్తినిచ్చాయని తెలిపింది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది సమంత. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమె ఖాతాను అనుసరించే వారి సంఖ్య మిలియన్లలో ఉంది.తాజాగా తమిళ సినిమా చిత్రీకరణ కోసం చెన్నై వెళ్లిన సమంత షూటింగ్‌ విరామంలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ‘చాలా రోజుల తర్వాత చెన్నైకి రావడం సంతోషంగా ఉంది. కుటుంబసభ్యులు, స్నేహితుల్ని ఇన్నాళ్లు  మిస్సయ్యాను. మళ్లీ వారందరిని కలుసుకోవడం ఉత్సాహంగా అనిపిస్తోంది. కెరీర్‌ తొలినాళ్లలో  నాపై వచ్చే ట్రోల్స్‌, విమర్శల్ని చూసి బాధపడేదాన్ని. వాటి వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఈ ప్రయాణంలో నాలో చాలా పరిణతి వచ్చింది. విమర్శల్ని సానుకూల దృక్పథంతో నవ్వుతూ స్వీకరించడం అలవర్చుకున్నాను’తెలిపింది. ఫిట్‌నెస్‌పై మీకు ఆసక్తి మొదలవ్వడానికి కారణమేమిటని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘ఇప్పటివరకు ఎవరికి తెలియని రహస్యమది. చైతూ రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్లేవాడు. చైతన్యను కలవడానికే అతడు వెళుతున్న జిమ్‌లో నేను చేరాను. ఈ క్రమంలో తెలియకుండానే నాలో ఫిట్‌నెస్‌ పట్ల ఆసక్తి మొదలైంది.’ అని చెప్పింది

VIDEOS

logo