బుధవారం 27 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 17:01:06

'హ్యాపిడేస్' టైస‌న్ కొత్త సినిమా షురూ

'హ్యాపిడేస్' టైస‌న్ కొత్త సినిమా షురూ

హ్యాపిడేస్ సినిమాలో టైస‌న్ గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు టాలీవుడ్ యాక్ట‌ర్ రాహుల్‌. ఈ యంగ్ యాక్ట‌ర్ న‌టిస్తోన్న కొత్త చిత్రం ప్రొడ‌క్ష‌న్ నంబ‌ర్ 1 హైద‌రాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. థ్రిల్ల‌ర్ కామెడీ క‌థాంశంతో వ‌స్తోన్న ఈ మూవీని విరాట్ చ‌క్ర‌వ‌ర్తి డైరెక్ట్ చేస్తున్నాడు. సాయి కార్తీక్, నాగం తిరుప‌తి రెడ్డి, శ్రీకాంత్ దీపాల్ నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ క్లాప్ కొట్ట‌గా..నాగం తిరుప‌తి కెమెరా స్విచాన్ చేశారు. కో ప్రొడ్యూస‌ర్ శ్రీకాంత్ దీపాల గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ‌ద‌ర్శ‌క‌నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ తోపాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్యక్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా సాయి కార్తీక్ మాట్లాడుతూ..ఇప్ప‌టివ‌ర‌కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసిన తాను తొలిసారి దివిజా స‌మ‌ర్ప‌ణ‌లో నాగంతిరుప‌తిరెడ్డి, శ్రీకాంత్ తో క‌లిసి నిర్మాణ‌రంగంలోకి ఎంట‌ర‌య్యాను. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా న‌న్ను ఆద‌రించిన‌ట్టే నిర్మాత‌గా కూడా ఆశీర్వ‌దించాల‌ని కోరారు.  చేత‌న్‌, సాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య‌, య‌మీ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo